: సరూర్ నగర్ పీఎస్ లో బాలకృష్ణపై న్యాయవాద జేఏసీ ఫిర్యాదు


ఓ సినిమా ఆడియో ఫంక్షన్ వేడుకలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన హిందుపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణపై హైదరాబాద్ పరిధిలోని సరూర్ నగర్ పోలీసు స్టేషన్ లో న్యాయవాద జేఏసీ ఫిర్యాదు చేసింది. రెండు రోజుల క్రితం జరిగిన 'సావిత్రి' ఆడియో విడుదల కార్యక్రమంలో ఆయన ఎంతమాత్రమూ క్షమించరాని వ్యాఖ్యలు చేశారని ఆరోపించిన న్యాయవాదులు, ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ లను పోలీసు అధికారులకు అందించారు. వీటిని పరిశీలించిన అనంతరం విచారణ జరిపి కేసు నమోదు చేయాలా? వద్దా? అన్న విషయాన్ని నిర్ణయిస్తామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News