: యూనిట్ కోసం ఆలూ ఫ్రై, పప్పు, రసం చేసిన హీరో నాగశౌర్య
గత వారం విడుదలైన ‘కళ్యాణ వైభోగమే’ చిత్ర హీరో నాగశౌర్య యూనిట్ సభ్యుల కోసం స్వయంగా గరిట చేతపట్టి రంగంలోకి దిగారట. సినిమా దర్శకురాలు నందిని రెడ్డి ఈ విషయాన్ని వెల్లడిస్తూ, నాగశౌర్య వంట చేస్తున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో వాటికి లైకుల మీద లైకులొస్తున్నాయి. ఇక ఏం వండి పెట్టారో చెప్పాలని వందలాది మంది అభిమానులు ప్రశ్నించగా, నందినీ రెడ్డి స్పందించారు. ఆలూ ఫ్రై, పప్పు, టమోట రసం, ఎగ్ కర్రీలను నాగశౌర్య వండారని, అన్నీ అద్భుతంగా ఉన్నాయని, ఇక మావాడికి పెళ్లి చేసేయొచ్చని సరదా పోస్టులను పెట్టారు.