: పోలీసులకు సహకరిస్తే ఇదే గతంటూ విశాఖలో మావోల దారుణం!
ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణలపై విశాఖ జిల్లాలో మావోయిస్టులు ఓ అపరాల వ్యాపారిని హత్య చేశారు. గూడెం కొత్త వీధికి చెందిన వ్యక్తిని గత రాత్రి అపహరించుకుని వెళ్లిన మావోలు, ఈ తెల్లవారుఝామున కుంకుంపూడి సమీపంలో కత్తితో నరికి చంపారు. పోలీసులకు అత్యంత సన్నిహితంగా ఉంటున్నాడని, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించినా పెడచెవిన పెట్టాడని, పోలీసులకు సహకరిస్తే, ఎవరికైనా సరే ఇదే గతి పడుతుందని హెచ్చరిస్తూ, మృతదేహం వద్ద ఓ లేఖను మావోలు వదిలి వెళ్లారు. గాలికొండ ఏరియా కమిటీ పేరుతో ఉన్న ఈ లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.