: కొత్త ట్విస్ట్... షీనాను చంపింది మైఖేల్!


భారత కార్పొరేట్ రంగంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో కొత్త ట్విస్టిది. షీనాను హత్య చేసింది తన మాజీ భర్త మైఖేల్ అని, తాను కేవలం సాయపడ్డానని ఇంద్రాణి స్వయంగా పీటర్ ముఖర్జియాతో చెప్పిందట. ఈ విషయాన్ని పీటర్ సోదరుడు గౌతమ్ ముఖర్జియా వెల్లడించినట్టు 'ముంబై మిర్రర్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇంద్రాణిని అరెస్ట్ చేసిన తరువాత బైకుల్లా జైలులో ఆమెను పీటర్ కలిశాడని, ఆ సమయంలో షీనాను తానేమీ చేయలేదని, తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని చెప్పిందట. మైఖేల్, ఆయన తొలి భార్య కుమారుడు కలసి షీనాను హత్య చేశారని, తాను కేవలం షీనా శరీరాన్ని తగులబెట్టేందుకు మాత్రమే సహకరించానని ఇంద్రాణి చెప్పినట్టు గౌతమ్ తెలిపారు. ఇంద్రాణి చెప్పిందంతా విని, తన అన్న పీటర్ అవాక్కయ్యాడని తెలిపాడు. ఈ కేసులో తన అన్న అన్యాయంగా జైల్లో ఉన్నాడని, 250 సాక్ష్యాల్లో ఏ ఒక్కటీ తన అన్నను దోషిగా నిరూపించేవి లేవని వివరించాడు.

  • Loading...

More Telugu News