: నమ్మిన స్నేహితుడే కాటేయాలని చూడడంతో... భవనంపై నుంచి దూకేసిన యువతి!
తనను తాను కాపాడుకోవడానికి రెండంతస్తుల భవంతిపై నుంచి అమాంతం కిందకు దూకేసిందో యువతి. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని హౌరా జిల్లాలో జరుగగా, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, తన స్నేహితుడిని నమ్మిన యువతి, అతనున్న అపార్ట్ మెంట్ కు వచ్చింది. ఆమెకు మత్తుమందు కలిపివున్న పానీయాన్ని ఇచ్చిన ఫ్రెండ్, ఆపై మరో ఇద్దరు స్నేహితులతో కలసి అత్యాచారానికి యత్నించారు. మత్తు పూర్తిగా ఎక్కకపోవడంతో, కామాంధుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భవంతిపై నుంచి దూకింది. తీవ్రగాయాలపాలైన ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.