: కాళహస్తిలో ఆనం కుమారుడి వీరంగం... స్పెషల్ దర్శనం కల్పించలేదని ఈవోపై చిందులు


టీడీపీ నేతల కుమారులు వీరంగమాడుతున్నారు. నిన్నటికి నిన్న కారుతో మహిళను అడ్డుకోవడమే కాక ఆమె చేయిపట్టి కారులోకి లాగేందుకు యత్నించిన టీడీపీ సీనియర్ నేత, ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు పుత్రరత్నం రావెల సుశీల్ చంచల్ గూడ జైలుకు వెళ్లాడు. తాజాగా నేటి ఉదయం మొన్నటిదాకా కాంగ్రెస్ లో ఉండి, ఇటీవలే టీడీపీలో చేరిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కుమారుడు ఆనం శుభకర్ రెడ్డి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ముక్కంటీశుడి సాక్షిగా ఆలయ కార్యనిర్వహణాధికారిగా ఉన్న ఓ మహిళా అధికారిపై చిందులు తొక్కారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నేటి ఉదయం శ్రీకాళహస్తి వచ్చిన శుభకర్ రెడ్డి ప్రత్యేక దర్శనం కల్పించాలని ఈవో భ్రమరాంబను కోరారు. అయితే శివరాత్రి సందర్భంగా వేలాదిగా భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో ప్రత్యేక దర్శనం సాధ్యం కాదని ఈఓ ఆయనకు తేల్చిచెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన శుభకర్ రెడ్డి ‘‘గతంలో ఎంతో మంది అధికారులను బదిలీ చేయించా. సీఎం చంద్రబాబుతో మాట్లాడి నీ కథ తేలుస్తా’’ అంటూ వీరంగమాడారట.

  • Loading...

More Telugu News