: సరికొత్త రికార్డు నెలకొల్పిన కెప్టెన్ కూల్ ధోనీ!


నిన్న రాత్రి బంగ్లా నగరం మిర్పూర్ లోని షేరే బంగ్లా స్టేడియంలో కాస్తంత ఉత్కంఠభరితంగా సాగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో చివరలో క్రీజులోకి వచ్చిన టీమిండియా టీ20, వన్డే జట్ల సారథి కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ జూలు విదిల్చాడు. వచ్చీ రావడంతోనే బ్యాటును ఝుళిపించిన ధోనీ ఆరు బంతుల్లోనే 20 పరుగులు పిండేశాడు. రెండు సిక్స్ లు, ఓ ఫోర్ బాదిన ధోనీ... తానెదుర్కొన్న చివరి బంతిని సిక్స్ గా మలిచి విన్నింగ్ షాట్ ను గుర్తుండేలా కొట్టాడు. ఈ షాట్ తో అతడు ఆసియా కప్ ను భారత్ కు అందించాడు. నిన్నటి విజయంతో ఆరుసార్లు టీమిండియా ఆసియా కప్ ను గెలిస్తే, వాటిలో రెండు సార్లు ధోనీ సారథ్యంలోనే కప్ ను చేజిక్కించుకుంది. ఇక నిన్నటి విజయంతో ధోనీ సరికొత్త రికార్డు కూడా నెలకొల్పాడు. ఐదు మేజర్ టోర్నమెంట్లలో తన జట్టును విజేతగా నిలిపిన విజయవంతమైన సారథిగా ధోనీ... ప్రపంచ క్రికెట్ లో అత్యున్నత శిఖరాన్ని చేరుకున్నాడు. ఇప్పటిదాకా ఐసీసీ టీ20 వరల్డ్ కప్, ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్, ఆసియా కప్ టీ20 కప్... ఇలా మొత్తం ఐదు మేజర్ టోర్నీల్లో సత్తా చాటిన ధోనీ తన జట్టును ఈ ఐదింటిలోనూ విజేతగా నిలిపాడు.

  • Loading...

More Telugu News