: ఏది వాక్ స్వాతంత్ర్యమో తెలియదా?: రాహుల్ కు అమిత్ షా ప్రశ్న
దేశాన్ని ముక్కలు చేస్తాం...అలా ముక్కలు చేసే వరకు పోరాడుతూనే ఉంటామని జేఎన్యూ విద్యార్థులు నినదిస్తే... ఏఐసీసీ ఉపాథ్యక్షుడు రాహుల్ గాంధీ వారిని పరామర్శించారని, అంతటితో ఆగకుండా వారికి మాట్లాడే హక్కు లేదా? అని ప్రశ్నిస్తున్నారని, స్టూడెంట్స్ కు వాక్ స్వాతంత్ర్యహక్కు ఉందని అంటున్నారని ఆరోపించారు. అసలు రాహుల్ గాంధీకి ఏది వాక్ స్వాతంత్ర్య హక్కో తెలియదా? అని ఆయన అడిగారు. అలాంటి వారికి మనం మద్దతిస్తామా? అని ఆయన ప్రశ్నించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కు ఏం కావాలో అది చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. రానున్న ఎన్నికల వరకు ప్రతి బీజేపీ కార్యకర్త చిత్తశుద్ధితో పని చేసి, ఏపీలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ఆయన సూచించారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు.