: కేన్సర్ నిర్ధారణ , చికిత్సలో మరో ముందడుగు!
కేన్సర్ వ్యాధి నిర్ధారణ, చికిత్స కోసం చేసిన పరిశోధనల్లో టెక్సాస్ యూనివర్సిటీ విజయం సాధించింది. కేన్సర్ జీవక్రియలో ప్రధానమైన కణ ప్రక్రియను సమన్వయపరచడంలో, మెదడు కణతి ఏర్పడడంలో పీజీకే1 అనే గ్లైకోలైటిక్ ఎంజైమ్ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో కేన్సర్ కణాలకు అవసరమైన శక్తిని అందజేయడంలో కీలకమైన గ్లైకోలిసిస్, సిట్రిక్ ఆసిడ్ చక్రంలో పీజీకే1 ఎంజైమ్ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు కనుగొన్నారు. పరిశోధన ఫలితాన్నివ్వడంతో కేన్సర్ నివారణకు మెరుగైన మార్గాలు కనిపెట్టవచ్చని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు.