: భూములు కొనుగోలు చేసినట్లు నిరూపిస్తే వెనక్కి రాసిచ్చేందుకు మంత్రులు సిద్ధం: చంద్రబాబు


రాజధాని ప్రాంతంలో మంత్రులు ఎవరైనా భూములు కొనుగోలు చేసినట్లు నిరూపిస్తే వాటిని వెనక్కి రాసిచ్చేందుకు మంత్రులు సిద్ధంగా ఉన్నారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. వారికి భూములు అమ్మిన ఏ రైతు అడిగినా వారు ఇచ్చేస్తారని అన్నారు. రాజధాని ప్రాంతంలో కొంత భూమిని కలిగి వుంటే మంచిదని భావించి, ఒకటో, రెండో ఎకరాలను కొనుగోలు చేస్తే, వేలాది ఎకరాలను బలవంతంగా లాక్కున్నారని వైకాపా నేతలు, తమకున్న పత్రిక మాధ్యమంగా తప్పుడు ప్రచారాన్ని మొదలు పెట్టారని ఆరోపించారు. వేలాది ఎకరాలు చేతులు మారాయని ఆరోపిస్తున్న జగన్, అందుకు సాక్ష్యాలుంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ల్యాండ్ పూలింగ్ లో ఎలాంటి అవకతవకలూ జరగలేదని తాను నిర్భయంగా చెప్పగలనని, ఆధారాలు చూపితే కచ్చితంగా చర్యలు తీసుకుంటానని అన్నారు.

  • Loading...

More Telugu News