: టీడీపీలోకి మరింత మంది... క్యూలో కొణతాల, గండి బాబ్జి, సర్వేశ్వరరావు


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరింత మంది తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకూ రాయలసీమ, కోస్తాంధ్రలతో పాటు శ్రీకాకుళం నేతలు టీడీపీలోకి ఫిరాయించగా, తాజాగా విశాఖ జిల్లా వంతు వచ్చింది. గత కొంత కాలంగా వైకాపాకు దూరంగా ఉన్నట్టు కనిపిస్తున్న కొణతాల రామకృష్ణతో పాటు అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జిలు నేడో రేపో టీడీపీలో చేరనున్నట్టు సమాచారం. కాగా, రెండు నెలల క్రితం ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్వయంగా కొణతాలను ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అప్పట్లో సంక్రాంతి తర్వాత తన నిర్ణయం చెబుతానని కొణతాల స్పష్టం చేశారు. ఆపై గండి బాబ్జీ సైతం తన కార్యకర్తలతో చర్చించి పార్టీ మారే విషయమై ప్రకటిస్తానని వెల్లడించారు కూడా. ఇక ఇప్పుడు వారి చేరికపై రంగం సిద్ధమైనట్టు టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News