: మీరే అంతా ప్రచారం చేశారు... మీకే తెలియాలి అంతా: మీడియాపై రావెల సుశీల్ రుసరుస
ఈ ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం రావెల సుశీల్ ను పోలీసులు ఉస్మానియాకు తీసుకురాగా, అక్కడాయన మీడియాతో మాట్లాడారు. తాను నిరపరాధినని, మీడియానే తనపై దుష్ప్రచారం చేసిందని రుసరుసలాడారు. "మీకు తెలియదా... మీరే అంతా ప్రచారం చేశారు. మీకే తెలియాలి ఏం జరిగిందో..." అన్నారు. తాను చదువుకునే వ్యక్తినని, ఎంబీఏ చేస్తున్నానని, చిన్నతనం నుంచి తల్లి, చెల్లిలను చూస్తూ పెరిగిన తాను, మహిళలను వేధింపులకు గురి చేసే వాడిని కాదని అన్నారు. వీడియో ఫుటేజ్ లను ప్రస్తావించి, కారు ఆగినట్టు కనిపిస్తుంది కదా అని ప్రశ్నించగా, కారు ఆగలేదని చెప్పారు. టైం వచ్చినప్పుడు అంతా చెబుతానని అన్నారు.