: నేనా... టీఆర్ఎస్ లోకా... నెవర్!: పొన్నాల లక్ష్మయ్య


తాను టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టు వస్తున్న వార్తా కథనాలపై తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్పందించారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం కాంగ్రెస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోను టీఆర్ఎస్ పార్టీలో చేరబోనని అన్నారు. అసలా ఆలోచన కూడా తనకు లేదని వివరించారు. కేసీఆర్ ఆడుతున్న మైండ్ గేమ్ లో భాగంగానే తనపై అసత్య ప్రచారం మొదలైందని, ఈ తరహా ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ అవినీతి పాలనపై ప్రజల్లోకి వెళ్లి ఎండగడతానని తెలిపారు.

  • Loading...

More Telugu News