: నా ఎకౌంటును హ్యాక్ చేశారు... ఏం పెట్టినా పట్టించుకోవద్దు: శృతి హసన్
తన ఫేస్ బుక్ ఖాతాను ఎవరో గుర్తు తెలియని వారు హైజాక్ చేశారని, అందులో వచ్చే పోస్టులను పట్టించుకోవద్దని నటి శృతి హసన్, తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. హైజాక్ కు గురైన తన ఫేస్ బుక్ ఖాతాను తిరిగి అధీనంలోకి తీసుకునేందుకు తన టెక్నికల్ టీం పనిచేస్తోందని వివరించారు. కాగా, శృతి ఫేస్ బుక్ ఖాతాలో ఎలాంటి అభ్యంతరకర పోస్టులూ లేవు. ఇదే సమయంలో కృతి సనన్ ఫోటోలు కనిపిస్తున్నాయి. కాగా, ఇటీవలి కాలంలో మహేశ్, ఎన్టీఆర్ తదితర హీరోల సామాజిక మాధ్యమ ఖాతాలు హ్యాక్ అయిన సంగతి తెలిసిందే.