: 50 ఏళ్లు వస్తున్నాయ్... ఇంకా యువకుడివేనా?: రాహుల్ ను ఎద్దేవా చేసిన స్మృతీ ఇరానీ


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, తాను 50 ఏళ్లకు దగ్గరవుతున్న విషయాన్ని మరచిపోయి, యువకుడినేనంటూ తిరుగుతున్నారని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఎద్దేవా చేశారు. తన తల్లి సోనియాగాంధీ అండతో, 10 ఏళ్లు ఎంపీగా ఉన్నప్పటికీ, అమేధీని ఎంతమాత్రమూ పట్టించుకోలేదని అన్నారు. బృందావన్ లో జరిగిన బీజేపీ యువమోర్చాలో ప్రసంగించిన ఆమె, రాహుల్ మాదిరిగా తాను ఎన్నడూ రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయలేదని అన్నారు. తన రక్తం జాతీయ వాదంతో నిండివుందని, తాను చేసే అభివృద్ధి పనులే మాట్లాడతాయని అన్నారు. భారతావనిని ముక్కలు చేయాలన్న ఆలోచనతో ఉన్న వారిని ప్రతిపక్షాలు వెనకేసుకురావడం ఏంటని దుయ్యబట్టారు. గతంలో కేరళలో తరగతి గదిలో బీజేపీ కార్యకర్తను హత్య చేసినప్పుడు వీరెందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News