: అత్యంత ఉత్కంఠం...పాట్నా పైరేట్స్ చేతుల్లోకి కబడ్డీ కప్పు!


ఆట మరో నిమిషం మాత్రమే మిగిలున్న సమయంలో స్కోర్లు 28-28. ఈ ఒక్క వాక్యం చాలు గత రాత్రి యూ ముంబా, పాట్నా పైరేట్స్ మధ్య జరిగిన ప్రో కబడ్డీ లీగ్ ఎంత ఉత్కంఠంగా సాగిందో చెప్పేందుకు. చివరి రైడింగ్ వరకూ విజేత ఎవరో తెలీకుండా సస్పెన్స్ గా సాగిన ఈ మ్యాచ్ లో ప్రో కబడ్డీ కొత్త చాంపియన్ గా పాట్నా జట్టు 31-28 తేడాతో విజయం సాధించింది. దీంతో లీగ్ లో వరుసగా 11 విజయాలు సాధించి, టైటిల్ ఫేవరెట్ గా నిలిచిన ముంబై జట్టు స్వల్ప తేడాతో పరాజయం పాలైంది. అంతకుముందు ప్రథమార్ధం ముగిసేసరికి 19-11 తేడాతో పాట్నా జట్టు ముందున్నప్పటికీ, ఆపై ముంబై పుంజుకుని స్కోర్లను సమం చేయగలిగింది. చివర్లో చేసిన చిన్న తప్పిదాలు ఆ జట్టును టైటిల్ కు దూరం చేశాయి.

  • Loading...

More Telugu News