: ఖమ్మంలో తొలిసారి... మీ ఓటు పడిందా? లేదా? తెలిపే ప్రింటవుట్!


తెలుగు రాష్ట్రాల ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఓటు వేసిన విషయాన్ని ప్రింటవుట్ రూపంలో ఇవ్వనున్నారు. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంపిక చేసిన 35 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ప్రింట్లు ఇస్తారు. దీనికోసం ఈవీఎంలతో పాటే ప్రత్యేక ప్రింటర్లను పోలింగ్ కేంద్రాలకు అధికారులు చేర్చారు. ఈ 35 కేంద్రాల కోసం 40 ఈవీఎంలను సిద్ధం చేశామని వెల్లడించిన అధికారులు, అదనపు ప్రింటర్లనూ రెడీగా ఉంచామని, జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారని కలెక్టర్ వెల్లడించారు. కాగా, ఖమ్మంలో ఓటర్లకు ప్రింటవుట్ ఇచ్చే పద్ధతిని పరిశీలించేందుకు జాతీయ స్థాయి ఎన్నికల అధికారులు సైతం వచ్చారు. ఈ విధానం విజయవంతమైతే, తదుపరి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఇదే పద్ధతి అవలంబించాలన్నది ఎన్నికల కమిషన్ ఉద్దేశం.

  • Loading...

More Telugu News