: కన్నయ్య నాలుకకు వెలకట్టిన బీజేపీ నేతపై బహిష్కరణ వేటు


దేశవ్యతిరేక వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలతో అరెస్టయిన కన్నయ్య కుమార్ నాలుకకు వెలకట్టిన బీజేపీ యువ మోర్చా నేత కుల్దీప్ వార్ష్ నేపై ఉత్తరప్రదేశ్ బర్ద్వాన్ జిల్లా బీజేపీ యూనిట్ చర్యలు తీసుకుంది. పార్టీని ఇబ్బందుల్లో పడేసేలా కన్నయ్య కుమార్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కుల్దీప్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఈ బహిష్కరణ ఆరేళ్లపాటు వర్తిస్తుందని జిల్లా నేతలు స్పష్టం చేశారు. అతనిని బహిష్కరించామని, అతని వ్యాఖ్యలకు, పార్టీకి సంబంధం లేదని ఆయన చెప్పారు. కాగా, దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన కన్నయ్య కుమార్ నాలుకను తెగ్గోసి తెచ్చిన వారికి ఐదు లక్షల రూపాయల బహుమానం అందజేస్తానని కుల్దీప్ వార్ష్ నే ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News