: తప్పు చేస్తే చట్టం నుంచి తప్పించుకోలేరు: రావెల సుశీల్ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం కామెంట్
ఫుల్లుగా మద్యం సేవించి ఒళ్లు తెలియని స్థితిలో వివాహిత చేయి పట్టుకున్న టీడీపీ సీనియర్ నేత, ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు కుమారుడు రావెల సుశీల్ ఘటనకు సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ఘాటుగా స్పందించారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కోసం నేడు హైదరాబాదు వచ్చిన చినరాజప్ప కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. రావెల సుశీల్ ఘటన ఏపీకి సంబంధించినది కాదని చెప్పిన చినరాజప్ప... తప్పు చేస్తే చట్టం నుంచి తప్పించుకోలేరంటూ వ్యాఖ్యానించారు.