: రాహుల్ ప్రసంగానికి ‘చోటా భీమ్’ జేజేలు!... సోషల్ మీడియాలో ‘దేశీ స్టఫ్’ వీడియో హల్ చల్


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మొన్న నరేంద్ర మోదీ సర్కారుపై విమర్శల జడివాన కురిపించారు. ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ స్కీములు ప్రవేశపెట్టారంటూ ఆయన చేసిన విమర్శలతో కేంద్రం నోట మాట రాలేదు. మరునాటికి గాని ప్రభుత్వం తేరుకోలేకపోయింది. లోక్ సభ వేదికగా రాహుల్ చేసిన ప్రసంగానికి జనం దేశవ్యాప్తంగా జనం జేజేలు పలికారు. జనంతో పాటు ఆన్ లైన్ లో చిన్నారుల సూపర్ హీరో ‘చోటా భీమ్’ కూడా జేజేలు పలికాడు. ఓ పక్క ఆవేశపూరితంగా ప్రసంగిస్తున్న రాహుల్ గాంధీ, మరో పక్క రాహుల్ ప్రసంగానికి అచ్చెరువొందుతున్న చోటా భీమ్... కొత్తగా పుట్టుకొచ్చిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ‘దేశీ స్టఫ్’ అనే సంస్థ యానిమేట్ చేసిన ఈ వీడియో నెటిజన్లను బాగానే రంజింపజేస్తోంది. ఈ వీడియోకు పెద్ద సంఖ్యలో హ్యూమరస్ కామెంట్లు కూడా వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News