: కారుతో పాటు రూ.23 వేల నగదు, సీసీటీవీ రికార్డర్ కూడా చోరీ: ఫిర్యాదులో ఎమ్మెల్యే ఎస్వీ


వైసీపీ సీనియర్ నేత, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కొత్త కారును చోరీ చేసిన దొంగలు కారులో పెట్టిన సూట్ కేసు, అందులోని రూ.23 వేల నగదు, సీసీటీవీ రికార్డర్ ను కూడా ఎత్తుకెళ్లారట. రెండు రోజుల క్రితమే ఎస్వీ సదరు స్కార్పియో కారును కొనుగోలు చేయగా, నిన్న ఇంటి ఆవరణలో పార్కు చేసిన కారును దొంగలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. కర్నూలు నగరంలోని జిల్లా ఎస్పీ క్యాంపు ఆఫీసుతో పాటు పోలీసు ప్రధాన కార్యాలయానికి అత్యంత సమీపంలో ఉన్న ఎస్వీ మోహన్ రెడ్డి ఇంటిలోనే చోరీ జరగడం గమనార్హం. కారు చోరీకి గురైందని తెలుసుకున్న ఎస్వీ మోహన్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కారుతో పాటు దొంగలు ఎత్తుకెళ్లిన నగదు, సీసీ టీవీ రికార్డర్ ను కూడా ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News