: ముంబయ్ లో షూటింగ్ చేస్తున్న ఎన్టీఆర్


'నాన్నకు ప్రేమతో' తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం 'జనతా గ్యారేజ్'. 'శ్రీమంతుడు' ఫేం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ గత నెలలో మొదలైంది. ఇప్పటివరకు హైదరాబాదులో జరిగిన షూటింగులో మోహన్ లాల్, ఇతర నటీనటులపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించారు. కాగా, నేటి నుంచి ముంబయ్ లో జరిగే షెడ్యూల్ లో ఎన్టీఆర్ కూడా పాల్గొంటున్నాడు. మాఫియా బ్యాక్ డ్రాప్ సన్నివేశాల చిత్రీకరణ కోసం ముంబయ్ లో ఇరవై రోజుల షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. అక్కడ ఎన్టీఆర్, ఇతర తారాగణం పాల్గొనే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. సమంతా, నిత్యా మీనన్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆగస్టు 12న చిత్రాన్ని విడుదల చేసేలా నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. 'శ్రీమంతుడు' చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ 'జనతా గ్యారేజ్' చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

  • Loading...

More Telugu News