: నేటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు... 10న సభ ముందుకు బడ్జెట్
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశాల్లో తొలుత శాసనమండలి, శాసనసభలను ఉద్దేశించి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత సభ మరునాటికి వాయిదా పడుతుంది. రేపు ఆదివారం, సోమవారం మహాశివరాత్రి సెలవు దినం కావడంతో సభ తిరిగి బుధవారం ప్రారంభమవుతుంది. ఇక పదో తేదీన సభలో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ను ప్రవేశపెడతారు. నెలాఖరు దాకా కొనసాగనున్న సమావేశాలు సెలవు రోజులను తీసివేయగా, మొత్తం మీద 18 రోజుల పాటు సభ జరగనుంది.