: రాణించిన శ్రీలంక ఓపెనర్లు...పాక్ టార్గెట్ 151


ఆసియాకప్ టైటిల్ పోరులో తలపడే రెండు జట్లు ఏవో ఇప్పటికే తేలిపోయింది. అయితే, ఆ తరువాతి స్థానం ఎవరిదో తేల్చుకునేందుకు పాకిస్థాన్, శ్రీలంక జట్లు ప్రస్తుతం తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ అఫ్రిది శ్రీలంకకు బ్యాటింగ్ అప్పగించాడు. దీంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక ఓపెనర్లు చండిమాల్ (58), దిల్షాన్ (75) అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా సీనియర్ ఆటగాడు దిల్షాన్ ఈ టోర్నీలో ఇప్పటివరకు విఫలమై విమర్శలు ఎదుర్కొంటున్న దశలో పాక్ బౌలర్లపై దాడికి దిగాడు. 56 బంతులు ఎదుర్కొన్న దిల్షాన్ 10 ఫోర్లు, ఒక సిక్సర్ తో 75 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచాడు. అనంతరం స్కోరు బోర్డును పరుగులు పెట్టించే క్రమంలో జయసూరియ (4), కపుగెదర (2), శనక (0) పెవిలియన్ చేరారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన శ్రీలంక జట్టు 150 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో ఇర్ఫాన్ రెండు వికెట్లు తీయగా, రియాజ్, మాలిక్ చెరో వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News