: నాకు అఫ్జల్ గురు ఆదర్శం కాదు ... రోహిత్ వేముల ఆదర్శం!: కన్నయ్యకుమార్
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేములను తాను ఆదర్శంగా తీసుకుంటానని జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్యకుమార్ తెలిపాడు. జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనకు అఫ్జల్ గురు ఆదర్శం కాదని అన్నాడు. అయితే అఫ్జల్ గురు భారతీయుడని ఆయన గుర్తు చేశాడు. కొందరు ఆరోపిస్తున్నట్టు తాను జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని అన్నాడు. తాను భరత మాత బిడ్డనని, జాతి వ్యతిరేకిని కాదని ఆయన స్పష్టం చేశాడు. దేశద్రోహం కేసులతో విద్యార్థుల గొంతులు నొక్కలేరని ఆయన అన్నాడు. జేఎన్యూ ర్యాలీలో ఏం జరిగిందో వీడియోలు తేటతెల్లం చేశాయని ఆయన తెలిపాడు. పేదరికం నుంచి, అవినీతి నుంచి విముక్తి కావాలని తాము కోరుకుంటున్నామని ఆయన చెప్పాడు.