: 20 వేల ఐఎస్ఐఎస్ యూనిఫాంల పట్టివేత


సిరియా, ఇరాక్ దేశాల్లో అల్లకల్లోలం రేపుతున్న ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థలకు చెందిన 20,000 యూనిఫాంలను స్పెయిన్ పోలీసులు పట్టుకున్నారు. నాలుగు కంటైనర్లలో తరలిస్తున్న ఈ దుస్తులను వాలెన్సియా, అల్జేసిరస్ పోర్టుల్లో పట్టుకున్నారు. పోర్టుల్లో లోడింగ్, అన్ లోడింగ్ సమయంలో కస్టమ్స్ ఇబ్బందులు తలెత్తకుండా, ఎవరికీ అనుమానం రాకుండా ఈ కంటెయినర్లపై 'సెకెండ్ హ్యాండ్ దుస్తులు' అంటూ లేబుళ్లు అతికించారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురుని అదుపులోకి తీసుకున్నట్టు స్పెయిన్ పోలీసులు తెలిపారు. వారిలో ఐదుగురు స్పెయిన్ దేశీయులని వారు వెల్లడించారు. ఈ దుస్తులు ఐఎస్ఐఎస్ కు ఆర్థిక సహాయం చేసే అంతర్జాతీయ సంస్థల నుంచి వచ్చినవని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News