: బాలీవుడ్ నటుడు మనోజ్ కుమార్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
నాటి తరం బాలీవుడ్ నటుడు మనోజ్ కుమార్ కు సముచిత గౌరవం లభించింది. భారత చలన చిత్ర రంగానికి ఆయన చేసిన సేవలకు గాను 2015 సంవత్సరానికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రకటించింది. డెబ్భై ఎనిమిది సంవత్సరాల మనోజ్ కుమార్ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. షాహీద్, ఉప్ కార్, ఓ కౌన్ థీ, పురాబ్ ఔర్ పశ్చిమ్, రోటీ కపడా ఔర్ మకాన్, క్రాంతి వంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో ఆయన తన నటనా కౌశలం ప్రదర్శించారు. కాగా, 1992 లో పద్మశ్రీ పురస్కారంతో మనోజ్ కుమార్ ను భారత ప్రభుత్వం సత్కరించింది.