: యోగాపై మంచి పాట రాస్తే... రూ. 5 లక్షల బహుమతి... కేంద్రం ప్రకటన!
యోగా గురించి కాస్తో, కూస్తో అవగాహన ఉందా? పాటలు రాయగలరా? అయితే, భలే చాన్స్ జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా, కేంద్ర ఆయుష్ శాఖ ఓ పోటీని ప్రకటించింది. ఇందులో భాగంగా ఒక వ్యక్తి లేదా ఓ గ్రూప్ యోగా ప్రధానాంశంగా పాటను స్వరపరిచి పాడి 3 నుంచి 5 నిమిషాల నిడివిలో ఉండేలా ఎంపీ3 ఫార్మాట్ లో పంపవచ్చు. అయితే, ఈ గీతం హిందీలో మాత్రమే ఉండాలి. వచ్చిన గీతాల్లో ఉత్తమమైనదాన్ని ఎంపిక చేసి రూ. 5 లక్షల బహుమతిని అందిస్తారు. పోటీల్లో పాల్గొనే వారు మార్చి 31లోగా పాటలను రికార్డు చేసి 'inf-moayush@gov.in' ఈ-మెయిలుకు పంపించాలని కేంద్రం కోరింది. పాట సైట్ 5 మెగాబైట్లకు మించకుండా ఉండాలన్న నిబంధన కూడా ఉంది సుమా.