: ఒకే విడతలో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఎన్నికలు
ఒకే విడతలో తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 16న ఈ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మే 19న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుందని సీఈఓ నజీమ్ జైదీ పేర్కొన్నారు. కాగా, ఈసారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కేంద్ర బలగాలను ఎక్కువ సంఖ్యలో మోహరించనున్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు ముందుగానే కేంద్ర బలగాలను తరలించారు.