: రిలాక్స్ అన్న మాట మర్చిపోండి: సహచరులకు బంగ్లా కెప్టెన్ పిలుపు
ఆసియా కప్ లో టైటిల్ పోరుకు టీమిండియాతో పాటు ఆతిథ్య బంగ్లాదేశ్ సిద్ధమవుతోంది. ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్ లో సత్తాచాటి టైటిల్ ను ఖాతాలో వేసుకోవాలని రెండు జట్లు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆటగాళ్లలో ఆ జట్టు కెప్టెన్ మొర్తజా స్పూర్తి పెంచుతున్నాడు. నాలుగేళ్లలో రెండు సార్లు టైటిల్ పోరుకు చేరడం ఆనందంగా ఉందని అన్నాడు. మూడు విజయాలతో ఫైనల్ చేరడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. టైటిల్ పోరులో భారత్ ను ఓడిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. టీమిండియాను ఓడించే వరకు రిలాక్స్ అన్న మాట మర్చిపోవాలని సహచరులకు సూచిస్తున్నాడు. ప్రణాళికాబద్ధంగా ఆడితే టీమిండియాను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పాడు. టీమిండియాను గతంలో ఓడించిన విషయాన్ని మొర్తజా సహచరులకు గుర్తు చేశాడు. ఒత్తిడికి గురికావాల్సిన అవసరం లేదని చెప్పిన మొర్తజా, స్వదేశంలో పూర్తి అవగాహన ఉన్న పిచ్ పై ఆడుతున్నామన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించాడు. సహజసిద్ధంగా ఆడితే టీమిండియాను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని అన్నాడు. టైటిల్ పోరులో సర్వశక్తులు ఒడ్డి పోరాడుదామని పిలుపునిచ్చాడు.