: ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో శాసనసభల ఎన్నికల షెడ్యూల్ ను ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ వివరాలను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ నజీమ్ జైదీ వెల్లడించారు. ఐదు రాష్ట్రాల్లోని 824 అసెంబ్లీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. అసోంలో 126, తమిళనాడులో 234, పశ్చిమ బెంగాల్ లో 294, పాండిచ్చేరిలో 30, కేరళలో 140 శాసనసభా స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో మొత్తం 17 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని పేర్కొన్నారు. కాగా, ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ తక్షణం అమల్లోకి వస్తుందని నజీమ్ జైదీ పేర్కొన్నారు.