: అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడం వల్లే కెమెరాను అర్థం చేసుకున్నా: సినీ హీరో నాని


గతంలో తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడం వల్లే కెమెరా ముందు ఎలా నటించాలో తెలుకున్నానని, అర్థం చేసుకున్నానని హీరో నాని అన్నాడు. కెమెరా టెక్నిక్ అర్థం చేసుకోవడం వల్లే తన మొదటి సినిమాలో భయం లేకుండా నటించగలిగానని చెప్పాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గానే తన కెరీర్ మొదలైందని, కనుక ఏదో ఒకరోజు సినిమాకు డైరెక్షన్ చేస్తానని చెప్పాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రోజుల్లో చాలా కష్టపడ్డానని, అటువంటి సందర్భాలలో కూడా తాను బాధపడలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. డల్ గా కాకుండా నవ్వుతూ ఉండటమంటే తనకు ఇష్టమని అదే తన శక్తి అని, దీనివల్ల మనం హుషారుగా ఉండటమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నవాళ్లకు కూడా ఆహ్లాదకరంగా ఉంటుందని నాని అన్నాడు.

  • Loading...

More Telugu News