: అల్లా ఆదేశాలు పాటించాను...: చిన్నారి తలతో మాస్కో వీధుల్లో పరేడ్ చేసిన న్యానీ
మూడు రోజుల క్రితం రష్యా రాజధాని మస్కో వీధుల్లో చిన్నారి తల నరికి దాన్ని పట్టుకుని "నేను ఉగ్రవాదిని", "అల్లాహో అక్బర్" అంటూ నినాదాలు చేసి సంచలనం సృష్టించిన ఉజ్బెకిస్థాన్ మహిళ గుల్ చెఖ్రా బొబుకులోవా న్యానీ, తన పైశాచికత్వానికి కారణాలను పోలీసు విచారణలో చెప్పింది. ఆమెను కోర్టులో ప్రవేశపెట్టిన తరువాత కూడా ఎటువంటి ఆందోళనా లేకుండా మాట్లాడింది. "అల్లా ఆదేశాలు నేను పాటించాను. సిరియాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ జరుపుతున్న దాడులతో అక్కడ సామాన్యుల రక్తం పారుతోంది. అందుకు ప్రతీకారంగానే ఈ పని చేశాను" అని చెప్పింది. కేవలం ముస్లింలనే ఎందుకు చంపుతున్నారని న్యాయమూర్తిని ప్రశ్నించిన ఆమె, ముస్లింలు కూడా బతకాలని కోరుకుంటున్నారని అంది. తనకు సిరియా వెళ్లి నివసించాలని ఉందని, అయితే, తన వద్ద డబ్బు లేకపోయిందని చెప్పింది. తాను చేసింది నేరం కాదని, తనకెలాంటి పశ్చాత్తాపం కలగడం లేదని వెల్లడించింది.