: ఇడిగో.. వర్మ సినిమా దావూద్ !


సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం ‘గవర్నమెంట్’కు సంబంధించిన ఒక ఫొటోను పోస్ట్ చేశాడు. ఆ ఫొటో ఎవరిదనుకుంటున్నారు? అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంది... కాదుకాదు.. ఆ పాత్ర పోషిస్తున్న నటుడిదంటూ వర్మ ట్వీట్లు చేసి తనదైన శైలిలో ట్విస్ట్ ఇచ్చాడు. స్వయంగా దావూదే తన సినిమాలో నటించడానికి ముందుకొచ్చాడని ఒక ట్వీట్... ఆయనెందుకు నటిస్తాడంటూ మరో ట్వీట్ వర్మ చేశాడు. తన సినిమాలో దావూద్ పాత్రను పోషిస్తున్న నటుడికి సంబంధించిన రెండు, మూడు ఫొటోలను వర్మ పోస్ట్ చేశాడు. కాగా, దావూద్, చోటా రాజన్ ల మధ్య శత్రుత్వం నేపథ్యంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

  • Loading...

More Telugu News