: రాంరెడ్డిది ఉన్నత వ్యక్తిత్వం: వెంకటరెడ్డి మృతికి కేసీఆర్ సంతాపం
టీ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే, తెలంగాణ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ రాంరెడ్డి వెంకటరెడ్డి మృతి పట్ల తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనారోగ్యం కారణంగా హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాంరెడ్డి కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. రాంరెడ్డి మృతిపై సమాచారం అందుకున్న వెంటనే కేసీఆర్ స్పందించారు. రాంరెడ్డి మృతికి ఆయన సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా రాంరెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కేసీఆర్... రాంరెడ్డిది ఉన్నత వ్యక్తిత్వమని పేర్కొన్నారు. అసెంబ్లీలో ఉల్లాసంగా కనిపించే రాంరెడ్డి వివాదాలకు అతీతులని కూడా కేసీఆర్ వ్యాఖ్యానించారు.