: నేటి ఐపీఎల్-6 వినోదం
ఐపీఎల్ ఆరవ సీజన్ లో నేడు 'కోల్ కతా నైట్ రైడర్స్ - కింగ్స్ ఎలెవన్ పంజాబ్' జట్లు తలపడనున్నాయి. రాత్రి 8 గంటలకు జరగనున్న ఈ మ్యాచ్ కోల్ కతా వేదికగా ప్రారంభమవుతుంది. కాగా, నిన్నరాత్రి 'చెన్నై సూపర్ కింగ్స్-హైదరాబాద్ సన్ రైజర్స్' మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై భారీ విజయం సాధించింది. కెప్టెన్ ధోనీ 67 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్ లో సూపర్ కింగ్స్ 5 వికెట్లు నష్టపోయి 160 పరుగులు చేసింది. అంతకుముందు హైదరాబాద్ 6 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఈ ఓటమి అనంతరం పాయింట్ల పట్టికలో రైజర్స్ జట్టు మూడోస్థానంలో ఉంది.