: సిలబస్ నుంచి ‘తెలంగాణ’ ఔట్... ఏపీపీఎస్సీ కీలక చర్య


మొన్నటిదాకా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న తెలుగు నేల ఇఫ్పుడు తెలంగాణ, ఏపీలుగా విడిపోయింది. రెండు రాష్ట్రాల్లో రెండు కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. తెలంగాణలో ఇప్పటికే ఉద్యోగాల భర్తీ ప్రారంభం కాగా, ఏపీలో త్వరలోనే అందుకు శ్రీకారం చుట్టనుంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్వహిస్తున్న పరీక్షల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అప్పటిదాకా ఉన్న సిలబస్ లో సమూల మార్పులు చేసిన కమిషన్.. ప్రత్యేక తెలంగాణ కోసం సాగిన సాయుధ పోరాటం, మలిదశ ఉద్యమం తదితరాలకు ప్రాధాన్యమిచ్చింది. తాజాగా ఏపీపీఎస్సీ కూడా సిలబస్ మార్పుకు సంబంధించిన కసరత్తును పూర్తి చేసింది. గ్రూప్-1, గ్రూప్-2 తదితర పరీక్షలతో పాటు ఇతర పరీక్షలకు సవరించిన సిలబస్ ను తన వెబ్ సైట్ లో నిన్న పెట్టింది. సిలబస్ మార్పులకు సంబంధించి ఏపీపీఎస్సీ కీలక చర్యలు తీసుకుంది. సిలబస్ నుంచి ‘తెలంగాణ’ అంశాన్ని పూర్తిగా తొలగించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన సాయుధ పోరాటాన్ని చరిత్ర సిలబస్ నుంచి తొలగించేసిన కమిషన్, మలిదశ ఉద్యమాన్ని అసలు ప్రస్తావించనేలేదు. అయితే విభజన నేపథ్యం, తదనంతర పరిణామాలను మాత్రం సిలబస్ లో చేర్చింది. ఇక ప్రణాళిక సంఘం పేరును తొలగించేసి, దాని స్థానంలో ‘నీతి ఆయోగ్’ పేరును చేర్చింది.

  • Loading...

More Telugu News