: ‘రంగీలా’ గర్ల్ కు పెళ్లైపోయింది!


సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ హిట్ మూవీ ‘రంగీలా’తో భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి ఊర్మిళా మటోండ్కర్ పెళ్లి చేసేసుకుంది. ‘రంగీలా’ చిత్రంతోనే కాక ఆ తర్వాత తాను నటించిన ‘సత్య’, ‘ప్యార్ తునే క్యా కియా’, ‘పింజర్’, ‘భూత్’ చిత్రాలతో కుర్రకారుకు కిర్రెక్కించిన ఊర్మిళ...నిన్న సాయంత్రం ముంబైలో అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో సహ నటుడు, జమ్మూ కాశ్మీర్ కు చెందిన నటుడు మొహిషిన్ అఖ్తర్ ను పెళ్లి చేసుకుంది. బాలీవుట్ నటి, ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు సహ యజమాని ప్రీతి జింటా పెళ్లి వార్త వెలువడిన మరునాడే ఊర్మిళ పెళ్లి జరగడంతో బాలీవుడ్ కు పెళ్లి కళ వచ్చేసినట్లైంది.

  • Loading...

More Telugu News