: డబ్బులు పంచుతున్న టీఆర్ఎస్ కార్యకర్త... చితకబాదిన ప్రతిపక్ష నేతలు
డబ్బులు పంచేందుకు యత్నించిన టీఆర్ఎస్ కార్యకర్తను ప్రతిపక్ష పార్టీల నేతలు చితకబాదిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేటలో జరిగింది. తొమ్మిదో వార్డులో డబ్బులు పంచేందుకు యత్నిస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తను ప్రతిపక్ష పార్టీల నేతలు అడ్డుకున్నారు. అనంతరం అతనిపై దాడికి పాల్పడ్డారు. ఈమేరకు పోలీసులకు సమాచారం అందించడంతో ఆ కార్యకర్తను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి లక్ష రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.