: సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రత్యక్షమైన సూరీడు!


ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా, ఆయన వెన్నంటి వుండి ప్రచారంలోకి వచ్చిన సూరీడు విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. టీడీపీ నేతల భూదందాపై ప్రతిపక్షపార్టీగా వైఎస్సార్సీపీ తీవ్ర ఆరోపణలు చేస్తున్న దశలో సూరీడు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకోవడం ఆసక్తిరేపుతోంది. వైఎస్ కు అత్యంత సన్నిహితుడిగా మెలగిన సూరీడు సుదీర్ఘ కాలంగా అజ్ఞాతంలో ఉన్నారు. అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రత్యక్షం కావడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరతీసింది. సూరీడుకు ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ ఇవ్వడంపై ముఖ్యనేతలకు కూడా సమాచారం లేకపోవడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ కలయిక ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

  • Loading...

More Telugu News