: జగన్ తన అరాచకాలకు ముద్రగడను ఉపయోగించుకుంటున్నారు: మంత్రి గంటా ఆరోపణ


వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సృష్టిస్తున్న అరాచకాలకు కాపు నేత ముద్రగడ పద్మనాభాన్ని ఉపయోగించుకుంటున్నారని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ఉద్యమాలను ప్రజలు నమ్మరని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముద్రగడ పద్మనాభం రాసిన లేఖ గురించి గంటా ప్రస్తావించారు. ఆ లేఖలో అవాస్తవాలు, అభూత కల్పనలు ఎన్నో ఉన్నాయని విమర్శించారు. కాపుల అభివృద్ధి కోసం ప్రభుత్వం పాటుపడుతోందని గంటా అన్నారు.

  • Loading...

More Telugu News