: పయ్యావుల కొడుక్కి అంత డబ్బెక్కడి నుంచి వచ్చింది?: రోజా
ఏపీ రాజధాని తుళ్లూరులోనే వస్తుందన్న విషయం అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేత పయ్యావుల కేశవ్ కు ఎలా తెలుసని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. రాజధాని సరిహద్దుల్లోనే నాలుగు ఎకరాల తొమ్మిది సెంట్ల భూమిని పయ్యావుల కొడుకు విక్రమ్ సింహా పేరు మీద కొనుగోలు చేశారని ఆమె ఆరోపించింది. చదువుకుంటున్న ఆయన కొడుక్కి అంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది..ఏ విధంగా ఆ భూములను కొనుగోలు చేశాడనే ప్రశ్నలకు పయ్యావుల సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని పరిధిలోని దళితుల భూములను టీడీపీ నేతలు ఒక పథకం ప్రకారం దోచుకున్నారని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ఈరోజు ఒక్కొక్క ఎకరం కోటి తొంభై లక్షలకు టీడీపీ నేతలు అమ్ముకునే విధంగా ప్రభుత్వం వారికి అండగా నిలుస్తోందని రోజా ఆరోపించారు.