: ‘శాలరీ పెర్ మినిట్’లో యోగీశ్వర్ దత్తే గ్రేట్!... ధోనీ, కోహ్లీ కంటే ఈ రెజ్లరే బెస్ట్!
‘శాలరీ పెర్ మినిట్’ అంటే... నిమిషానికి ఎంత సంపాదిస్తున్నామనేగా. ప్రత్యేకించి క్రీడాకారులకు ఈ తరహా ఆర్జనను లెక్కగడుతున్నాం. మరి క్రీడా ప్రపంచంలో కోట్లు కొల్లగొట్టేస్తున్న మన కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీల కంటే మెరుగైన గణాంకాలు ఎవరికి ఉంటాయిలే అనుకుంటే మాత్రం మనం తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఆర్జనలో ధోనీ ప్రపంచ స్థాయిలో సత్తా చాటినా, కోహ్లీ జేబులో కోట్లు వచ్చి పడుతున్నా... వారిద్దరి కంటే భారత రెజ్లర్ యోగీశ్వర్ దత్తే బెటరట. నమ్మశక్యం కాకున్నా, ‘శాలరీ పెర్ మినిట్’ గణాంకాలు చూస్తే నమ్మి తీరాల్సిందేనంటోంది ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం. ఆ పత్రిక కథనం ప్రకారం... రెజ్లింగ్ లో సత్తా చాటుతున్న యోగీశ్వర్ దత్... బౌట్ లో దిగితే నిమిషానికి రూ.1.65 లక్షలు సంపాదిస్తున్నాడట. ఈ తరహా గణాంకాల్లో యోగీశ్వర్ దత్... ప్రపంచ స్థాయిలోనే ఏడో స్థానంలో నిలిచాడు. ఇక ఈ జాబితాలో నిమిషానికి రూ.26 కోట్లు సంపాదిస్తూ టెన్నిస్ స్టార్లు రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ లు... జాబితా అగ్రస్థానంలో ఉన్నారని ఆ కథనం పేర్కొంది.