: రికార్డు స్థాయిలో 17 గంటలు నాన్ స్టాప్ గా ప్రయాణించిన విమానం


మధ్యలో ఎక్కడా ఆగకుండా అత్యంత ఎక్కువ దూరం ప్రయాణం చేసిన దుబాయి-ఆక్లాండ్ విమాన సర్వీసు ఈరోజు గమ్యస్థానం చేరుకుంది. ఎమిరేట్స్ కు చెందిన ఎయిర్ బస్ ఏ380 విమానం తొలిసారిగా దుబాయి నుంచి న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ కి ప్రయాణించింది. ఈ కమర్షియల్ విమానం మొత్తం 14,200 కిలోమీటర్లు 17 గంటలపాటు ఏకధాటిగా ప్రయాణించి, ప్రపంచ రికార్డు నెలకొల్పినట్టు సదరు విమాన సర్వీసు సంస్థ అధికారులు పేర్కొన్నారు. కాగా, 2014లో సిడ్నీ నుంచి డల్లాస్ కి ఏర్పాటు చేసిన విమాన సర్వీసు 13,800 కిలోమీటర్లు నాన్ స్టాఫ్ గా ప్రయాణించింది. ఈ రికార్డును దుబాయి-ఆక్లాండ్ సర్వీస్ అధిగమించినట్లు అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News