: భారత్-పాకిస్థాన్ మథ్య యుద్ధానికి లాడెన్ ప్రయత్నించాడు: వెల్లడించిన అమెరికా పత్రాలు


పాకిస్థాన్ కేంద్రంగా పురుడు పోసుకున్న ప్రతి ఉగ్రవాద సంస్థ లక్ష్యం భారత్ ను అథోగతిపాలు చేయడం, భారత్ లో కల్లోలం రేపడం! కానీ, ప్రపంచాన్ని గడగడలాడించిన ఆల్ ఖైదా తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్ మాత్రం రెండు దేశాల మధ్య యుద్ధాన్ని సృష్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. లాడెన్ ను హతమార్చిన అమెరికన్ సీల్ కమెండోలు అతని నివాసం నుంచి కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో 100 పత్రాలను తాజాగా విడుదల చేశారు. ఈ పత్రాల్లో పలు కీలక అంశాలు ఉన్నాయి. లాడెన్ భారత్ ను వేయికళ్లతో గమనించేవాడు. 'ఇండియా ప్లాన్స్ టు ఎటాక్ పాకిస్థాన్' పేరిట ఓ నోట్సు రాసుకున్నాడు. యుద్ధానికి సిద్ధమవ్వడం తప్ప భారత్ అన్ని కార్యక్రమాలు ప్రారంభించిందని అందులో పేర్కొన్నాడు. ప్రపంచ దేశాల నుంచి 134 యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని, ఇది కార్యరూపం దాల్చితే ప్రపంచంలో అతిపెద్ద మిలటరీ డీల్ అవుతుందని లాడెన్ అభిప్రాయపడ్డాడు. బ్రిటిష్ పాలనలో భారత మిలటరీ శిక్షణ, అణుశక్తిలో భారత్-అమెరికాల మధ్య సహకారం, భారత్ లో ఉన్న అణురియాక్టర్ల గురించిన పూర్తి వివరాలను రాసుకున్నాడు. పాకిస్థాన్ పై గూఢచర్యానికి ఇజ్రాయెల్ ఉపగ్రహాన్ని భారత్ ఉపయోగించుకుంటోందని లాడెన్ ఆ పత్రాల్లో పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News