: 'బాహుబలి-2' రిలీజ్ డేట్ 14 ఏప్రిల్ 2017


ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాహుబలి-2 చిత్రం విడుదల తేదీని నిర్ణయించారు. 2017 ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని హీరో ప్రభాస్ ఈ రోజు ట్విట్టర్ ద్వారా తెలిపాడు. బాహుబలికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి, ఈ ఏడాది చివరినాటికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని తొలుత చిత్ర నిర్వాహకులు అనుకున్నారు. కానీ, ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్, గ్రాఫిక్స్ వర్క్ కు మరింత సమయం పడుతుండడంతో ‘బాహుబలి-2’ విడుదల తేదీని వచ్చే వేసవికి వాయిదా వేయాల్సి వచ్చింది. కాగా, ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితర నటులతో రూపొందించిన ‘బాహుబలి’ పలు రికార్డులు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీన్స్ మొదలైన అంశాలకు సంబంధించి ‘బాహుబలి’ వండర్ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘బాహుబలి-2’పై కూడా అభిమానులు, ప్రేక్షకులు భారీ అంచనాలతో ఉన్నారు.

  • Loading...

More Telugu News