: ప్రెషర్ కుక్కర్ పేలి చిన్నారులకు గాయాలు


ప్రెషర్ కుక్కర్ పేలడంతో నలుగురు చిన్నారులకు గాయాలైన సంఘటన విశాఖపట్టణంలో జరిగింది. ఇక్కడి 21వ వార్డులోని సాలిపేట అంగన్ వాడీ కేంద్రంలో ఈరోజు జరిగిన ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు.. సరోజిని అనే మహిళ అంగన్ వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. వంటమనిషి లేకపోవడంతో ప్రతిరోజూ పిల్లలకు ఆమె వండిపెడుతోంది. అదేవిధంగా ఈరోజు కూడా వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు ప్రెషర్ కుక్కర్ పేలింది. దీంతో అక్కడే ఆడుకుంటున్న పిల్లలపై వేడి వేడి అన్నం పడింది. ఈ సంఘటనలో నలుగురు చిన్నారులకు గాయాలయ్యాయి. సాలిపేట వాసులు వెంటనే స్పందించి చిన్నారులను కేజీహెచ్ కు తరలించారు.

  • Loading...

More Telugu News