: చంద్రబాబుకు డాక్టరేట్ ప్రకటించిన యూనివర్శిటీ మూత!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేస్తున్నామని గత సంవత్సరం డిసెంబర్ 18న ప్రకటించిన షికాగో స్టేట్ యూనివర్శిటీ (సీఎస్యూ) ఆర్థిక సంక్షోభం కారణంగా మూతపడింది. వర్శిటీని మూసేస్తున్నామని సీఎస్యూ ప్రెసిడెంట్ డాక్టర్ థామస్ కల్హన్ వెల్లడించారు. 1867లో ఓ చిన్న స్కూలుగా ప్రారంభమై క్రమంగా యూనివర్శిటీ స్థాయికి ఎదిగిన ఇందులో ప్రస్తుతం యూజీ కోర్సులను నిర్వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో వర్శిటీ ర్యాంకు గణనీయంగా దిగజారడం, విద్యార్థుల చేరిక తగ్గడం, ఫెడ్ రిజర్వ్ నిధులివ్వకపోవడంతో మూతపడినట్టు తెలుస్తోంది.