: భవిష్యత్ బాంబర్ ను చూపి, సెన్సేషన్ క్రియేట్ చేసిన యూఎస్!
సుమారు రూ. 5.5 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులో భాగంగా యూఎస్ ఎయిర్ ఫోర్స్ చేపట్టిన భవిష్యత్ బాంబర్ ఎలా ఉంటుందన్న విషయాన్ని తొలిసారిగా బహిర్గతం చేసి ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. భూమిపై ఎక్కడైనా బాంబులు కురిపించి రాగల ఈ ఫ్యూచరిస్టిక్ బాంబర్ ప్రస్తుతానికి 'బీ-21' కోడ్ నేమ్ తో తయారవుతోంది. గతంలో ఎయిర్ ఫోర్స్ బీ-2 బాంబర్లను తయారు చేసిన నార్త్ రాప్ గ్రూమన్ సంస్థ దీన్ని కూడా తయారు చేస్తుండగా, తొలి విమానం సిద్ధమయ్యేందుకు మరింత సమయం పట్టవచ్చని తెలుస్తోంది. ఒక్కోటి 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 3,437 కోట్లు) విలువైన ఈ విమానాలను దీర్ఘకాల లక్ష్యంతో తయారు చేస్తున్నట్టు అమెరికా గతంలోనే ప్రకటించింది. ప్రస్తుతం విడుదలైన చిత్రంలో నలుపు రంగులో, జిగ్ జాగ్ ఆకారంలో, రాడార్ గుర్తు పట్టనంత చిన్న సైజులో ఉన్నట్టు తెలుస్తోంది.