: ఇస్లాం ఉన్నంత కాలం ఉగ్రవాదం ఆగదు, ఆపలేం: బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్య
ప్రపంచంలో ఇస్లాం మతం ఉన్నంత కాలం ఉగ్రవాదాన్ని ఎవరూ ఆపలేరని బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, భత్కల్ వంటి ప్రదేశాల్లో శాంతిని నిలపాలంటే, ప్రపంచం నుంచి ఇస్లాంను తరిమేయాలని అన్నారు. ఆగ్రాలో హత్యకు గురై మరణించిన వీహెచ్పీ కార్యకర్త స్మృతి సభలో కథేరియా చేసిన వ్యాఖ్యలు పార్లమెంటులో తాజా రభసకు కారణం కాగా, ఇక అనంత కుమార్ వ్యాఖ్యలు మరో కొత్త వివాదానికి దారి తీస్తాయనడంలో సందేహం లేదు.